సాయం కోసం వారి దగ్గరికి వెళ్తే గెంటేశారు..! ఆ హీరో మాత్రమే ఆదుకున్నారు’..!
Fri May 30, 2025 09:08 Others
తెలుగులో సుమారు 300 సినిమాలకు పైగా సినిమాల్లో నటించారు పావలా శ్యామల. తన అద్భుతమైన నటనతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు. గోలీమార్ వంటి సినిమాల్లో పావలా శ్యామల పండించిన కామెడీని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. అయితే ప్రస్తుతం ఆమె వృద్ధాప్య సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. వీటికి తోడు ఆర్థిక సమస్యలు పావలా శ్యామల జీవితాన్ని ప్రశ్నార్థకం చేశాయి. ప్రస్తుతం ఓ అనాథాశ్రమంలో ఉంటోన్న ఆమె తన ఆవేదనను అందరితో పంచుకున్నారు. ‘నేను నటిగా కొనసాగుతున్న సమయంలో వచ్చిన డబ్బు మొత్తం నా కుమార్తె అనారోగ్య సమస్యలకు చికిత్స చేయించడానికి ఖర్చు చేశాను. ప్రస్తుతం నా వయసు పైబడింది నేను సినిమాలలో నటించే పరిస్థితి కూడా లేదు. సంపాదించిన డబ్బు మొత్తం వైద్యం కోసమే ఖర్చు చేశాం. ప్రస్తుతం నేను నా కూతురు అనాథల్లాగా బతుకుతున్నాం. నా ఈ పరిస్థితి చూసి చాలామంది హీరోలు సహాయం చేశారు. చిరంజీవి కూడా నాకు లక్షల్లో సహాయం చేసి ఆదుకున్నారు. అంతేకాదు గతంలో లక్ష రూపాయలు వెచ్చించి ‘మా’లో మెంబర్‌షిప్‌ను చిరంజీవి ఇప్పించారు. అలాగే నా కూతురి ఆరోగ్యం గురించి తెలుసుకుని మరో రెండు లక్షల ఆర్థిక సాయం చేశారు’.
కేసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాకు పదివేల రూపాయల పెన్షన్ వచ్చేది. ఇప్పుడు కూడా ఆ పెన్షన్ తోనే బ్రతుకుతున్నాం. దిల్ రాజు కూడా నా పరిస్థితి చూసి సాయం చేస్తామన్నారు. మా మేనేజర్ మీతో మాట్లాడతారని చెప్పారు. కానీ ఇప్పటివరకు దిల్ రాజు గారి నుంచి నాకు ఎలాంటి సహాయం అందలేదు. అలాగే సాయం కోసం కొందరు స్టార్ హీరోల ఇంటికి వెళ్లాను. కానీ అక్కడ భాష రాని హిందీ వాచ్ మెన్లు నన్ను దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. నాకు ఏదైనా అయితే నా కూతురు ఒంటరిగా మిగిలిపోతుందని బాధగా ఉంది. అందుకే ఇలాంటి బాధలు పడే కంటే నేను నా కూతురు చనిపోతే బాగుండు’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు పావలా శ్యామల. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతన్నాయి. సినీ ప్రముఖులు ఆమెను ఆదుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆలస్యంగా ఓటీటీ ట్రాక్ పైకి.. ఫారిన్ కష్టాలు పడితేనే గాని తెలియదు..!
ఏపీ మద్యం కేసులో నలుగురు నిందితులకు కస్టడీ! న్యాయవాది సమక్షంలో..
బెయిల్.. అయినా తప్పదు జైలు అన్నట్టుగా వల్లభనేని వంశీ పరిస్థితి! కీలక ఆదేశాలు జారీ.!
చిక్కుల్లో కమల్ హాసన్.. బెంగళూరులో కేసు నమోదు! ఆయన వ్యాఖ్యలపై కన్నడిగుల ఆగ్రహం..
ఈ సంప్రదాయం కళాకారులకు గొప్ప.. సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి!
కన్నీటి గాధ! ఉద్యోగాల కోసం వెళ్లి మయన్మార్ లో చిక్కుకున్న భారతీయులకు చిత్రహింసలు!
ఉద్యోగులకు గుడ్ న్యూస్! భారీగా పెరగనున్న జీతాలు! ఎంతంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #RealHero #HumanityMatters #SupportWhenNeeded #KindnessCounts #HeroWithHeart #EmotionalStory
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.